విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పి మాటతప్పిన మోడీకి కర్నూలులో పర్యటించే హక్కులేదని ,16న కర్నూలులో మోడీ పర్యటను మోడీ గోబ్యాక్ అంటు 15న చేపట్టిననిరసన ర్యాలీ జయప్రదం చేయాలని వామపక్షపార్టీల నేతలు పిలుపు నిచ్చారు. గురువారం సీఆర్ భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మునెప్ప, నక్కి లెనిన్‌బాబు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం, సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి, సీపీఎం నాయకులు రాధాకృష్ణ, రాముడు, రాజశేఖర్, నారాయణ, ఎస్‌యూసీఐ నాయకులు నాగన్న, క్రిష్ణలతో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గిడ్డయ్య, గౌస్‌దేశాయ్, నాగన్నలు మాట్లాడుతూ 11 సం మోడీ పాలనలో ఏపీకి చేసింది ఏమిలేదన్నారు. జీఎస్టీ రూపంలో ప్రజలపై 8వేల కోట్లరూపాయలు బారం మోపుతున్నారని గతంలో విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు నేడు జీఎస్టీ తగ్గించాడని ఉత్సవాలు చేసుకోవడం దుర్మార్గమన్నారు. రాయలసీమకు ఒక్కసాగునీటి ప్రాజెక్టు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 11 సంవత్సరాల నుండి జీఎస్డీ బారం మోపీ ప్రజలను ఇబ్బందుల గురిచేసిన వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇస్తారా అని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా లేదా, విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణను అడ్డుకుంటారా లేదా అన్న విషయం తెలియచేయాలన్నారు.ఈ ప్రాంత ప్రజల కోసం ఏమి చేయకుండా సంబరాలు చేసుకోవడంను వామపక్షపార్టీలుగా ఖండిస్తున్నామన్నారు.ఇందుకు నిరసనగా ఈనెల 15న జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు బారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావులు హాజరైతున్నారని తెలిపారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఏపీ ద్రోహి మోడీ గోబ్యాక్15న బారీ నిరసన ర్యాలీ … వామపక్షపార్టీ నేతలు
- Advertisement -
RELATED ARTICLES


