- Advertisement -
విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ లు మంగళవారం ఉదయం ఆమె చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకుని, పూల మొక్కతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు నర్సరీ రంగంలోని పలు సమస్యలపై చర్చించినట్లు మార్గాని తెలిపారు. ఏకో టూరిజంకు సంబంధించి, ధవలేశ్వరం నుండి పొట్టిలంక వరకు బోట్ షికార్ కు సంబంధించిన విషయాలను చర్చించినట్లు చెప్పారు


