విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని శివానగర్లో ఆశా కార్యకర్త అయిన ఇర్ఫాన్ (47) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలు ఇర్ఫాన్ ఆశా కార్యకర్తగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించేవారు. అనుకోకుండా గురువారం రాత్రి కొన్ని అనారోగ్య సమస్యలతో పాటు గురక రావడంతో, ఎందుకు ఇలా వస్తోంది అని కుటుంబ సభ్యులు గమనించారు. అంతలోనే ఎటువంటి కదిలిక లేకపోవడంతో హుటాహుటిగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షించిన తర్వాత వారు అప్పటికే మృతి చెందడం జరిగిందని, గుండెపోటుతో మరణించడం జరిగిందని తెలిపారు. ఆశా కార్యకర్తగా ఇర్ఫాన్ ఎన్నో సేవలను కొనసాగించి, తోటి ఉద్యోగుల వద్ద, అధికారుల వద్ద మంచి గుర్తింపు పొందారని తెలిపారు. మృతురాలికి భర్త బాబా ఫక్రుద్దీన్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికి సహాయాన్ని అందిస్తున్నాడని తెలిపారు. వీరికి ఇమ్రాన్, దాదు, షామీర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో ఇమ్రాన్ కు వివాహం జరిగిందని తెలిపారు. మొత్తం మీద అనుకోకుండా ఇర్ఫాన్ మృతి చెందడం వల్ల ఆ కుటుంబం విషాద ఛాయాల్లో మునిగిపోయింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
గుండెపోటుతో ఆశా కార్యకర్త మృతి
- Advertisement -
RELATED ARTICLES


