- Advertisement -
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సివిల్ లైన్స్‌లోని ఆమె అధికారిక నివాసంలో జన్ సున్‌వాయ్ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన ఒక వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మొదట అతడు కొన్ని పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం,దాడి చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనపై స్పందించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.


