Homeజిల్లాలుఅనంతపురంపెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో వేలం వాయిదా

పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో వేలం వాయిదా

- Advertisement -

విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన టెంకాయల విక్రయ హక్కు, కొబ్బరి చిప్పల సేకరణ హక్కుల కోసం ఆగస్టు 7న నిర్వహించాల్సిన సీల్డ్ టెండర్-కమ్-బహిరంగ వేలాన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సాకే రమేష్ బాబు గురువారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తేదీ, సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల పాటదారులు తదుపరి ప్రకటనను గమనించి సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు