విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : డీఎస్సీ-2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ గురువారం ఉరవకొండలో వైఎస్ఆర్సిపి పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈకార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా, స్థానిక నాయకులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, ఒక్కో పోస్టు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు అమ్ముడైనట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల వసతి దీవెన బకాయిలు రూ.9,500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు నవీన్ రెడ్డి, సాకే పురుషోత్తం, మధు ప్రసాద్, చిరంజీవి, ఎంపీపీ నరసింహులు, పార్టీ నాయకులు వీరన్న, అశోక్ కుమార్ బసవరాజు, ప్రసాద్, షంషుద్దీన్ భాష, గందోడి మారేష్, ఎర్రి స్వామి రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎస్సీ-2025 అక్రమాలపై విచారణ కోరుతూ ఉరవకొండలో రిలే నిరాహార దీక్షలు
- Advertisement -
RELATED ARTICLES


