Sunday, November 16, 2025
Homeజిల్లాలువిజయనగరంగ్రామోద్యోగ వికాస యోజన పై అవగాహన

గ్రామోద్యోగ వికాస యోజన పై అవగాహన

- Advertisement -

:డాక్టర్ ఎస్ గ్రీవ్, స్టేట్ డైరెక్టర్

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా): రాజాం నైరెడ్లో డాక్టర్ ఎస్ గ్రీప్, స్టేట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామోద్యోగవికాస యోజన పై అవగాహన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కెవిఐసి ద్వారా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు కుండల తయారీ, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, కుట్టుమిషన్, పండ్లు కూరగాయలు ప్రోసెసింగ్, హనీ బీ ట్రైనింగ్ మొదలగు శిక్షణా కార్యమాల గురించి వివరించడం జరిగినది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ( పీఎంఈజీపి)లో ఉన్న సబ్సిడీ గురించి మరియు కొత్తగా యూనిట్లు ప్రారంభించిన వారికి పీఎంఈజీపి స్కీమ్ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో నైరెడ్లో గల శిక్షణ పొందుతున్న మరియు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నైరెడ్ డైరెక్టర్ ఎం రాజేష్, ప్రోగ్రామ్ మేనేజర్లు సి నాగరాజు, సాయి కిషోర్ మరియు కెవిఐసి సిబ్బంది, నైరెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు