Monday, January 13, 2025
Home Blog Page 44

వైజాగ్ వైపు నుండి వచ్చే రైళ్లను, బస్సులను, ప్రైవేటు వాహనాలను తరచూ తనిఖీలు చేపట్టాలి

మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు  చేపట్టాలి

శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి)
విశాలాంధ్ర – అనంతపురం : వైజాగ్ వైపు నుండి వచ్చే రైళ్లను, బస్సులను, ప్రైవేటు వాహనాలను తరచూ తనిఖీలు చేపట్టాలని, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేపట్టాలని శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) ఆదేశించారు.
శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని అడిషనల్ ఎస్పీ డివి.రమణమూర్తితో కలిసి శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) మాట్లాడుతూ… వైజాగ్ వైపు నుండి వచ్చే రైళ్లను, బస్సులను, ప్రైవేటు వాహనాలను తరచూ తనిఖీలు చేపట్టాలని, జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా ప్రతి పాఠశాల, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు  )ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో పిల్లల తల్లిదండ్రులు, ఇతర శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పోలీస్ శాఖ వారితో కలిసి సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, పంటల సాగు నందు గంజాయి సాగు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులకు సూచించారు. అనంతపురంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్తి స్థాయి డి-అడిక్షన్ వార్డుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అడిషనల్ ఎస్పీ డివి.రమణమూర్తి మాట్లాడుతూ.. గత సమావేశం తర్వాత నవంబర్ 16 నుండి డిసెంబర్ 19 వరకు ఒక కేసు నమోదయిందని, నలుగురు నిందితులలో ముగ్గురిని రిమాండ్ కు పంపామని   వారి నుండి 1.521 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముమ్మరంగా జరుపుతున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మాలోల, అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి  సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, హార్టికల్చర్ డిడి నరసింహారావు, ఐసిడిఎస్ పీడీ వనజా అక్కమ్మ, డిటిసి వీర్రాజు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, డిఈఓ ప్రసాద్ బాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్చార్జి డిడి సుభాషిని, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రైల్వే, అటవీ శాఖ, ఇంటర్మీడియట్ బోర్డ్, వైద్య ఆరోగ్యశాఖ, పాలిటెక్నిక్, జేఎన్టీయూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను స్వర్ణ పంచాయతీలుగా తీర్చి దిద్దాలి

విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం రూరల్ : అధికారులు పాలకులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఇన్చార్జ్ ఎంపీడీవో వెంకటేష్ అన్నారు శుక్రవారం మహిళా సమైక్య భవనంలో సచివాలయ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంపీడీవో
ఎం వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని పాలకులు అధికారులు సమన్వయంతో స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి అన్నారు గ్రామాల్లో ప్రజలకు కావలసిన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెడితే ఆరోగ్యవంతమైన గ్రామాలు నిర్మాణం అవుతాయన్నారు శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామ పంచాయతీల అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, శాఖలో ఉన్న విభాగాల పై అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో గ్రామాల సుస్థిర అభివృద్ధికి ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూసీ రాజా శ్రీనివాస్, సర్పంచులు మద్దుకూరి గంగాభవాని, కుడవల్లి హనుమంతు, తాడేపల్లి బేబీ, బొనిగే పోతన్న, ములకల సూర్యారావు,ఆరుగులను శ్రీనివాస్, పీహెచ్సీ వైద్యులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

కార్గో డోర్ డెలివరీ ని మరింత అభివృద్ధి పరచండి.. డిపో మేనేజర్ సత్యనారాయణ

విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ సంస్థ ద్వారా ఆర్టీసీ బస్సులలో కార్గో వ్యవస్థ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నదని, ఇందులో భాగంగానే కార్గో డోర్ డెలివరీ ని మరింత అభివృద్ధి పరచాలని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఆవరణములో డెలివరీ ప్రచార మాసోత్సవాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్గో వ్యవస్థ వ్యాపారస్తుల వద్ద, ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. కార్గో ద్వారా ఒక కేజీ బరువు నుండి 50 కేజీల వరకు (జిఎస్టి అదనం) డోర్ డెలివరీని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఒక్కొక్కరు మూడు డెలివరీనీ కార్గొ ద్వారా ద్వారా చేయించి కార్గో అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఆర్టీసీ సంస్థకు పరోక్షంగా కార్బో వ్యవస్థ ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ఈ డోర్ డెలివరీ వ్యవస్థను మనతోపాటు మన కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు, భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ఈనెల 20వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ డోర్ డెలివరీ సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో 80 ప్రాంతాలలో కలదని తెలిపారు. 50 కేజీల బరువు వరకు పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సదుపాయం కలదని తెలిపారు. ఆర్టీసీ సంస్థలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లతోపాటు కార్యాలయ సిబ్బంది తాము బస్సు ఎక్కి సర్వీస్ చేసేటప్పుడు దిగి పోయే ప్రయాణికులకు డోర్ డెలివరీ సౌకర్యం గురించి తెలిపి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. మన ధర్మవరం డిపోకు ఇచ్చిన టార్గెట్ ను అందరూ సహాయ సహకారాలు అందించి ఆర్టీసీ సంస్థను అభివృద్ధి బాటలో నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్రీరాములు, రామ్మోహన్ రెడ్డి, డిపో మెకానికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

106 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగటవీధిలోగల శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయ ఆవరణములో ఈ నెల 22వ తేదీ ఆదివారం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 106వ ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ శిబిరమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలతో పాటు ఉచిత మందులు కూడా పంపిణీ చేయబడునని తెలిపారు. శిబిర దాతగా కీర్తిశేషులు బద్దెల బాలమ్మ, కీర్తిశేషులు బద్దెల వెంకటరామయ్య, కీర్తిశేషులు బద్దెల వరలక్ష్మి, కీర్తిశేషులు బద్దెల వెంకటరత్నయ్య జ్ఞాపకార్థం వీరి కుమారులు బివి. శ్రీనివాసులు అండ్ బ్రదర్స్ వారు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వైద్యులు వివేక్ కుళ్లాయప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్, సతీష్ కుమార్, జై దీపు నేత లచే వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు.

నవవధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని రావి వెంకటం పల్లి గ్రామంలో ఉన్న ఆండ్ర నాంచారమ్మ కళ్యాణ మండపంలో శుక్రవారం ఎర్రగుంటపల్లి గ్రామ సర్పంచ్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యుగంధర్ కుమారుడి వివాహ శుభకార్యమునకు ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డిని పురోహితుడు మంత్రోచ్ఛారణతో భాజా, భజంత్రీలు, మేళ, తాళాలతో సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డి నవ వధువులను తలంబ్రాలు వేసి నిండు నూరేళ్లు, పిల్లాపాపలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం నవ వధువులకు పెళ్లి కానుకగా దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జెసి అభిమానులు పాల్గొన్నారు.

అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలి

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తాం…

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు

విశాలాంధ్ర -అనంతపురం : గత పార్లమెంట్ సమావేశంలో అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోడీ అమిత్ షాలు అహంకారంతో రాజ్యపాలన చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో జరిగిన అగ్రిగోల్డ్ ద్వారా మోసపోయి మనస్థాపంతో మృతి చెందిన కుటుంబాలకు ఆదుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఏపీలో 800 మంది, కర్ణాటక లో 400 మంది , ఒరిస్సాలో 100 మంది అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసం చేసిన కారణంగా వీరు మృతి చెందడం జరిగిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం వారికి పూర్తిగా న్యాయం చేయలేకపోయారన్నారు. వైకాపా ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి ఏదో కొంత నగదు అందించి ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి దాని గురించి పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనటువంటి జనసేన, టిడిపి నాయకులు అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటామని చెప్పి ఆరు నెలల కావస్తున్న పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. గత 18వ తేదీన సిఐడి చీఫ్ రవి శంకర్ అయ్యంగార్ నేతృత్వంలో సిపిఐ పార్టీ,అగ్రిగోల్డ్ యాజమాన్యం, సిఐడి లో అప్పట్లో పని చేసిన విశ్రాంతి ఉద్యోగులు, బాధితులతో బాధితుల పరిష్కార దిశగా వేదికను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డీజీపీ ద్వారకాతిరుమలరావు, రవిశంకర్ అయ్యంగార్ లకు అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన సిపిఐ పార్టీ అభినందిస్తుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడుని కలవడం జరిగిందన్నారు . ఈ విషయంపై చంద్రబాబు శాసనసభ సమావేశంలో చర్చించలేదన్నారు. జనవరి 30లోగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి , నగర కార్యదర్శి శ్రీరాములు , నగర సహాయ కార్యదర్శి అలిపిర తదితరులు పాల్గొన్నారు.

పేదల సమస్యల పట్ల పోరాడే వ్యక్తి సత్ గాడ్గే బాబా

ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య

సత్ గాడ్గే బాబా చిత్రపటానికి నివాళులర్పించిన ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య

విశాలాంధ్ర- అనంతపురం : చాకలి ఐలమ్మ కాలనీలో స్వచ్ఛ భారత్ కోసం పరితపించిన సత్ గాడ్గే బాబా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య మాట్లాడుతూ… గాడ్గే బాబా మహారాష్ట్రలో జన్మించారన్నారు. పేదల సమస్యల పట్ల పోరాడే వ్యక్తి అని కొనియాడారు. అప్పట్లోనే శ్రమదానం చేసి పరిశుభ్రత కోసం తపించాడని భారత్ రాజ్యాంగ నిర్మత బిఆర్ అంబేద్కర్ గాడ్గే బాబాని అభినందించడం జరిగిందన్నారు . అలాంటి మహనీయులని కేంద్ర ప్రభుత్వం వర్ధంతి జయంతి నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు సి నాగప్ప,ఐలమ్మ కాలనీ సిపిఐ కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శిలు సంజీవులు, లక్ష్మీనారాయణ, చేతి వృత్తి దారుల సమాఖ్య గౌరవాధ్యక్షులు ఈశ్వరమ్మ చేతి వృత్తిదారుల సమాఖ్య నగర కార్యదర్శి వీరాంజి లక్ష్మీదేవి, వీర నారాయణప్ప, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి చొరవతోనే సిసి రోడ్లు ఏర్పాటు

అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి జోక్యంతోనే చుక్కలూరు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ చుక్కలూరు గ్రామ ఇంచార్జ్ నాగరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి వర్షం వచ్చిందంటే కాలనీలలో వర్షం, మురుగు నీరు పోక ప్రజలు ఆ నీటిలోని నడుచుకుంటూ ఇంటిలోనికి వెళ్లి, ఇంటి నుండి బయటికి వెళ్లాలన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎన్నికల సమయంలో జెసి.అస్మిత్ రెడ్డి, జెసి.ప్రభాకర్ రెడ్డిలు చుక్కలూరు గ్రామం లో పర్యటించారు. ఆ సమయంలో గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొన్ని కాలనీలలో సిసి రోడ్లు, మురికి కాల్వలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారికి విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలు విన్న జెసి. అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన వెంటనే చుక్కలూరు గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటుకు దాదాపు 30 లక్షలతో రోడ్లు నిర్మాణం చేస్తున్నామన్నారు. దీంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తమ సమస్యలను ఆలకించి గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

భూ సమస్యలు పరిష్కరించుకోవాలి

తహశీల్దారు బి సుదర్శన రావు
విశాలాంధ్ర – నెలిమర్ల : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దారు బి సుదర్శన రావు తెలిపారు. మండలపరిధిలోని సారిపల్లి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాలు పరిష్కరించటమే రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులలో కేవలం భూమికి సంబంధించిన సమస్యలే కాకుండా ప్రజలు ఏ సమస్యలు ఉన్న అర్జీలు అందజేసి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వేణుగోపాల్, ఎం ఎస్ దివ్య మానస, వి ఆర్ ఓ లు ఎం లక్ష్మి, కె వెంకటరమణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సూక్ష్మ నీటి సేద్యం గురించి అవగాహన సదస్సు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లోని వలేటివారిపాలెం రైతు సేవ కేంద్రం నందుగురువారం రైతులకు మరియు వ్యవసాయ ఉద్యానవన సహాయకులు సూక్ష్మ నీటి సేద్యం గురించి అవగాహన సదస్సు మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ , ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు కొరకు డ్రిప్పు మరియు స్ప్రింక్లర్లు రాయితీపైన అందిస్తుందని 5 ఎకరాల లోపు రైతులకు డ్రిప్ 90% రాయితీ ద్వారా ఒక రైతుకు గరిష్టంగా 2,18,000/- రూపాయలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు ఐదు ఎకరాల నుండి పది ఎకరాలు లోపు గల రైతులకు 70% రాయితీపైన 3,46,000/- రూపాయలు గరిష్టంగా ఇస్తున్నారు స్ప్రింకులర్లు విషయమై ఐదు ఎకరాల లోపు రైతులకు 55% రాయితీ ద్వారా 30 పైపులు ఐదు స్ప్రింక్లర్లు లేదా 41 పైపులు 9 స్ప్రింక్లర్లు అందిస్తున్నట్లు తెలిపారు. రాయతీ పొందు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రం నందు దరఖాస్తు చేసుకోగలరు కావలసిన డాక్యుమెంట్స్ 1బీ, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, ఫీల్డ్ మ్యాప్ తీసుకొని రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ మరియు ఉద్యానవన సహాయకుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియచేశారు అలాగే శాఖవరం మరియు వలేటివారిపాలెం గ్రామాలలో మహేంద్ర ఈపీసీ కంపెనీ ద్వారా రైతులకు ప్రభుత్వ రాయితీతో అందించబడిన స్ప్రింక్లర్లు తనిఖీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు నరేష్, మహేంద్ర ఈపీసీ కంపెనీ ప్రతినిధులు శ్రీహరి మరియు అన్ని గ్రామ రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ మరియు ఉద్యానవన సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.