Tuesday, January 7, 2025
Home Blog Page 80

సెకీ ఒప్పందంతోనాకు సంబంధం లేదు

0

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్‌లో నిర్ణయం కోసం అర్థరాత్రి దస్త్రాన్ని పంపి సంతకం చేయమన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కేవలం మంత్రి వర్గం చర్చ కోసం అనుకుని సంతకం చేశానన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి బాలినేని కౌంటర్‌ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఒంగోలు జిల్లాల్లో ఆర్టీసీ సైట్లను తీసుకున్నవా?, లేదా? అని నిలదీశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా పని చేస్తూ కందుకూరు, సంత నూతల పాడు నియోజకవర్గాల్లో చెవిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీయమంటావా? అని నిలదీశారు. చెవిరెడ్డిది చిత్తూరు జిల్లా అయ్యి ఉండి కూడా ఒంగోలులో మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అండతో చేసిన బాగోతాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే కాదని… విజయమ్మ, షర్మిల కూడా అని అన్నారు. ఎవరి మెప్పు కోసం పని చేయడం లేదని, ఈ విషయాన్ని అందరూ గుర్తెరగాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లో మార్పులు.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లో కీలక మార్పులు ఉ ఇక పై రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయిన మూడో నెలలో ఒకేసారి ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోతే, రెండో నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి అందిస్తారని, అలాగే రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే, మూడో నెలలో ఆ రెండు నెలల మొత్తాన్ని కలిపి మూడు నెలల పెన్షన్ మొత్తం ఒకేసారి అందించబడుతుందని తెలిపారు. మూడు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే, వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి, వారి పెన్షన్ ఆపివేయడం జరుగుతుందని, వారు తిరిగి తమ స్వస్థలనికి వచ్చిన తర్వాత పెన్షన్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంటే, వారికి తిరిగి పెన్షన్ అందించబడుతుందని తెలిపారు. కావున పై విషయాలను పెన్షన్ దారులు గమనించాలని తెలిపారు.

ఓటు వజ్రాయుధం లాంటిది.. డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.. కతి జున్ కుప్రా

విశాలాంధ్ర ధర్మవరం : ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డివిజనల్ పరిపాలన అధికారిని కతిజున్ కుప్రా తెలిపారు
ఈ సందర్భంగా పట్టణంలోని రేగాటిపల్లి రోడ్ శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో, కళాశాల విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు అనేది రాష్ట్రంలో మంచి పరిపాలనకు శ్రీకారం చూపుతుందని తెలిపారు. ఓటును సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి కు మార్గదర్శకం సుగమం అవుతుందని తెలిపారు. 2025 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోనుటకు అర్హులు అని తెలిపారు. ఓటు యందు ఫారం-6, ఫారం-6 ఏ, ఫారం-7, ఫారంబి8 వాటిపై కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఓటు హక్కు మీ జన్మ హక్కు అని వారు తెలిపారు. యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు అని తెలిపారు. అనంతరం ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు పోలింగ్ బూత్ కేంద్రాలు పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓ లకు సూచనలు తీసుకోవలసిన జాగ్రత్తలను వారువివరించారు. ఈ కార్యక్రమంలో ఈ డి టి ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి, సిబ్బంది రాజ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ హర్షవర్ధన్, అధ్యాపక బృందం, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి భక్తులకు ఉచితంగా అన్నదానం.. గురు స్వామి విజయకుమార్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట మార్గంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరంలో అయ్యప్ప మాల ధారణ భక్తాదులకు ఈనెల 22వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఉచిత భోజన పంపిణీని నిర్వహిస్తున్నట్లు గురుస్వామి విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు బోధన పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయ్యప్ప మాల ధారణ వేసిన ప్రతి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు.

అనారోగ్యంతో మృతి చెందిన సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కు స్వగ్రామంలో అంత్యక్రియలు

విశాలాంధ్ర – అనంతపురం : వజ్రకరూరు మండలం కొనకొండ్లకు చెందిన బి.రమేష్ హైదరాబాద్ మూడవబెటాలియన్ లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గాపని చేస్తున్నాడు. ఇతను అనారోగ్యంతో నిన్న హైదరాబాద్ లో చనిపోయారు. స్వగ్రామమైన వజ్రకరూరు మండలం కొనకొండ్లలో ఆయన మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. అంతిమ యాత్రలో వజ్రకరూరు ఎస్సై నాగస్వామి పాల్గొని పాడె మోశారు. స్థానిక పోలీసులు కన్నీటి వీడ్కోలు పలికారు. సి ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎం .వి .కృష్ణయ్య, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులాల వారీగా గణన చేయాలి..

బీసీ సమన్వయ కమిటీ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులాల వారీగా గణన చేయాలని బీసీ సమన్వయ కమిటీ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి గోవిందు అధ్యక్షతన బీసీల కుల జన గణన చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తెలపడం జరిగిందన్నారు. అనంతరం గోవిందు మాట్లాడుతూ 78 ఏళ్లుగా కోల్పోతున్న తమ వాటాలను సాధించుకోవడానికి సమగ్ర కులాల వారీగా జన గణన చేయాలని బీసీలు అందరూ తమ ఇండ్ల నుంచి బయటికి వచ్చి, వీధి పోరాటాలు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. బీసీలకు కుల గణన లేకపోవడం వలన జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన వాటా అన్నింటిలోనూ దక్కకుండా ఓసీలే అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. నిజానికి విద్యతోపాటు ఉద్యోగాలు చట్టసభలు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు తదితర వాటిల్లో బీసీలకు జనాభా దామాసా ప్రకారం దక్కాల్సి ఉందని తెలిపారు. అంతేకాకుండా బడ్జెట్లో నిధులు కూడా ఈ మేరకు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. బీసీలకు కూడా ఆర్టికల్ 340 ద్వారా వచ్చే ప్రభుత్వాలు వారి వాటా వారికి ఇవ్వాలని తెలిపారు. కానీ నేటి రాజకీయాలు గెలుపొందిన పార్టీ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని తమ జనాభాకు మించిన రిజర్వేషన్లను ఈ డబ్ల్యూ ఎస్ పేరుతో 10 శాతము విద్యా ఉద్యోగాల్లో పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా బీసీ పెద్దలు న్యాయస్థానాలకు వెళ్లినప్పుడు బీసీలకు అధికారికంగా జనాభా లెక్కలు ఉంటే వారి వాటా తీసుకోవాలని తీర్పును కూడా వెల్లడించడం జరిగిందని వారు గుర్తు చేశారు. నిజానికి కమ్మ రెడ్ల జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సిన పోగా మిగిలినవన్నీ సీట్లు బీసీ లవే తెలిపారు. బీసీలు పెద్ద ఎత్తున అన్ని రంగాలలో నష్టపోతున్నారని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గ్రహించి గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జంగమన్న, వెంకటేశు, బోయ రవిచంద్ర, నరసింహులు, రోషన్ జమీర్, పొలాల లక్ష్మీనారాయణ, రామచంద్ర,సూరి, కళ్యాణి, లక్ష్మీనారాయణ, వీర నాగప్ప, శ్రీరాములు, నాగయ్య, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్దానం కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రంలో 75 శాతం మేర పోస్టులు ఖాళీ

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దీనిపై శ్ర‌ద్ధ పెట్ట‌లేదు

శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించి శాస్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు

కిడ్నీ పరిశోధనా సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం..

శాస‌న స‌భ‌లో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి

విశాలాంధ్ర ధర్మవరం : ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రంలో స‌రిప‌డా స్పెషలిస్టులు, ముఖ్యంగా నెఫ్రాల‌జిస్టులు, సిబ్బందిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో స‌రిప‌డా నియ‌మించ‌లేద‌ని, ఐదేళ్ల కాలంలో దీని ప‌ట్ల ఏమాత్రం శ్ర‌ద్ధ‌పెట్ట‌లేద‌ని ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. శుక్ర‌వారం శాన‌స స‌భ‌లో ఉద్దానం కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రంపై స‌భ్యులు గౌతు శిరీష‌, కూన ర‌వికుమార్ త‌దిత‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ స‌మ‌స్య ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యమ‌ని, దీర్ఘ‌కాలిక స‌మ‌స్య అని అన్నారు. కిడ్నీ స‌మస్య‌ల‌తో చాలా మంది ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ స‌మ‌స్య‌పై గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌యాంలో జార్జియాతో ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకోవ‌డం ద్వారా ఇక్క‌డ ప‌రిశోధ‌నా కేంద్రాన్ని నిర్మించాల‌ని అప్ప‌ట్లో నిర్ణ‌యించార‌న్నారు. జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించాక దీనిపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దృష్టిసారించార‌న్నారు. స్థానిక ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో 2019 డిసెంబ‌రులో ఆర్భాటంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్క‌డ కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రాన్ని ప్రారంభించారే త‌ప్ప స‌రిప‌డా వైద్య నిపుణుల్ని, సిబ్బందిని నియ‌మించ‌లేద‌న్నారు. ఆరుగురు నెఫ్రాల‌జిస్టు లకు గాను కేవలం ఒక్కరే ఉన్నారని, యూరాలజీలో ఆరుగురు అవసరం ఉండగా నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అనిపిస్తే విభాగంలో 8 మందికి ఆరుగురు రేడియాలజిస్టులు నలుగురు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు అని తెలిపారు. అన్ని విభాగాలలో మొత్తం 61 మంది ఉండాల్సి ఉండగా కేవలం 17 మంది మాత్రమే ఉన్నారని 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ పోస్టులు పూర్తి కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అక్కడ సిలికా పురుగుమందుల అవశేషాలు తదితర సమస్యలు ఉన్నట్లు నిపుణుల బృందం గుర్తించిందని ప్రధానంగా జెనెటిక్స్ సమస్యలు ఉన్నట్లు కూడా తాము గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సురక్షితమైన నీరు వాడాలని వారు సూచించారు. నాన్ రికరింగ్ కింద 8.19 కోట్లు మేరా రావాల్సి ఉందని, దీని కారణంగానే జీతాలు కూడా చెల్లించలేదని విషయం వారు స్పష్టం చేశారు. అధికారులతో మాట్లాడి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకాకుళం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నందున స్పెషలిస్టులకు టీచింగ్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ పథకం కింద 53 ఎన్టీఆర్ వైద్య సేవ కింద 217 డయాలసిస్ కేంద్రాలు మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయిలో సర్వే చేయించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా తెలిపారు. డయాలసిస్ రోగులకు ఇప్పటికే పదివేల రూపాయలు ప్రభుత్వం పెన్షన్ రూపంలో ఇస్తోందని మందులు వాడటానికి కూడా 5000 రూపాయలు ఇస్తే బాగుంటుందని సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఆర్థిక శాఖతో సంప్రదించాకే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 50 లక్షల నిధులు మంజూరు..

ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన చొరవతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 50 లక్షల నిధులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా మంజూరు చేయించడం జరిగిందని ఎన్డీఏ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన సమావేశం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మాధవిలతో ఐఓసీ జిల్లా సేల్స్ మేనేజర్ మహేష్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రికి అవసరమైన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ ఈ నిధులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించడానికి ఉపయోగపడతాయని, గడచిన కొద్దికాలంగా ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాయని అలాగే అందరి సహకారంతో మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టి ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రి మెరుగైన వసతులు, వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల సి ఎస్ ఆర్ ద్వారా ఈ విధంగా పెద్ద నిధులను అందించడం ప్రజలకు ఆరోగ్య సేవలు చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది అని తెలిపారు.

వినికిడి సమస్య ఉన్నవారికి ఉచిత మెగా వైద్య శిబిరం…

ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గ ప్రజల కొరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో వినికిడి సమస్య ఉన్నవారికి ఈనెల 25వ తేదీన పోతుకుంట రోడ్డు నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సంస్కృత్తి సేవ సమితి, దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వినికిడి సమస్య లేని ధర్మవరం నియోజకవర్గం ః కొరకు ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు.నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వినికిడి పరీక్షలు, వినికిడి చికిత్సలు మిషన్లు కొరకు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావున ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
మరిన్ని వివరాలకోసం ధర్మవరం నియోజకవర్గం ప్రజల దగ్గరలో ఉన్న ఏఎన్ఎంలు లేదా ఆశా వర్కర్స్ ని సంప్రదించాలని తెలిపారు.

పేద ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందించడమే మా లక్ష్యం..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడా మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తిశేషులు వేల్పుల భూషప్ప జ్ఞాపకార్థం వీరి కుమారులు వేల్పుల వెంకటేశు అండ్ సన్స్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరంలో వైద్య చికిత్సలను డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జైదీపు నేత వ్యవహరించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.