Homeజిల్లాలుశ్రీ సత్యసాయితల్లి పాలే బిడ్డకు రక్ష....జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్

తల్లి పాలే బిడ్డకు రక్ష….జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి:- మీ బిడ్డలకు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని అందించేందుకు తల్లిపాలే బిడ్డకు రక్ష అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు.గురువారం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పిడి ప్రమీల ఆధ్వర్యంలో తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా తల్లిపాలు వారోత్సవాలు యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ సత్యమ్మ గుడి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వారు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి తల్లిపాలు ప్రాముఖ్యతను నినాదాలతో తెలియపరుస్తూ, ప్రతిజ్ఞ చేయించారు..ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఒకే జీవనాధారమని తల్లి పాలకు సరిరావు మరే ఇతర పాలని కాబట్టి తల్లి పాలను ఏ విధిగా తక్కువగా చూడకుండా, బిడ్డలకు ఆరోగ్య కరమైన, ఆనందకరమైన జీవితాన్ని తల్లి పాలనే బిడ్డకు అందించాలన్నారు. ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి మాట్లాడుతూ తల్లి పాలకు ఎటువంటి ప్రత్యామ్నాయం లేదని, ప్రతి బిడ్డకు తల్లిపాలు అందేలా చేయడమే మన సంకల్పం అని అన్నారు. నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి మరియు సంపూర్ణ పోషణ లభిస్తుందని అన్నారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారమని తల్లిపాలు శిశువును న్యుమోనియా మరియు అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధులనుండి కాపాడుతుందని అన్నారు. తల్లిపాలు పిల్లల మేధస్సు ను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీవో కుమారి సువర్ణ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి ప్రమీల, డిఎం అండ్ హెచ్ ఓ ఫిరోజ్ బేగం, జయంతి సిడిపిఓ, పుట్టపర్తి గాయత్రి ఐసిడిఎస్ ఓడిసి, మహేష్ డి సి పి ఓ, సుధీర్ వర్మ డిస్టిక్ కో ఆర్డినేటర్, డి సి పి యు సిబ్బంది, ఐసిడిఎస్ సూపర్వైజర్స్,పుట్టపర్తి హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది,అంగన్వాడి వర్కర్స్, మెప్మా సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, విజ్ఞాన్ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు