రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు.
ధర్మవరం : క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలని రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచా క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు అధికమవుతున్నాయని, దీనికి ముఖ్య కారణం వ్యాధిని ముందుగా గుర్తించాలని, అదేవిధంగా చికిత్స పొందకపోవడమేనని వారు స్పష్టం చేశారు. ప్రజలు కూడా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు. ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. పురుషులలో నోరు, గొంతు, ఊపిరితిత్తులు క్యాన్సర్ గా వస్తాయని, అదే మహిళలకు అయితే రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారం వద్ద క్యాన్సర్ వస్తాయని తెలిపారు. అంతేకాకుండా పురుషులలో పొగాకు నమలుట, బీడీ, సిగిరెట్ కాల్చుట ముఖ్య కారణమైతే, స్త్రీలలో సంతానానికి సంబంధించిన సమస్యలు ముఖ్యమైనవి అని తెలిపారు. దీర్ఘ కాలముగా జ్వరము, విపరీతముగా బరువు తగ్గుట, ఆకలి మందలించుట లాంటివి సాధారణ క్యాన్సర్ లక్షనములు అని తెలిపారు. కావున ప్రజలు క్యాన్సర్ పట్ల అప్రమత్తమై ముందస్తు పరీక్షలు నిర్వహించుకుని, తొందరగానే గుర్తించి, చికిత్స పొందితే క్యాన్సర్‌ను త్వరగా నియంత్రించవచ్చునని వారు తెలిపారు.
క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలి..
- Advertisement -
RELATED ARTICLES


