Homeహైదరాబాద్పాల పిట్టను బంధించడం నేరం

పాల పిట్టను బంధించడం నేరం

- Advertisement -

విశాలాంధ్ర -రాజేంద్రనగర్ : పాల పిట్ట ను పట్టుకోవడం, బంధించడం, హింసించడం, విక్రయించడం లేదా ప్రజలకు ప్రదర్శించడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని శంషాబాద్ అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. పాలపిట్ట ప్రకృతిలో జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పండుగ సంప్రదాయాల పేరుతో పక్షులను పట్టుకుని బందించడం లేదా ప్రజలకు ప్రదర్శించడం వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కాబట్టి ప్రజలందరూ పక్షుల పట్ల దయ, కరుణ చూపుతూ వాటి స్వేచ్చను కాపాడాలని అటవీ శాఖ కోరుతోంది.
చట్టపరమైన నిబంధనలు
2 (2) 2, 1972 ( వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ) Act, 1972) 2 5 9 25 వన్యప్రాణుల వేట నిషేధించబడింది. ఈ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం సంబంధిత నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శిక్షలు విధించబడతాయి. పాలపిట్టను పట్టుకోవడం, బంధించడం, విక్రయించడం లేదా హాని కలిగించడం వంటి చర్యలకు సంబంధించి, వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకోబడతాయి. దసరా పండుగ సందర్భంగా, ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు వరకు శంషాబాద్ అటవీ రేంజ్ పరిధిలోని దేవాలయాలు, పండుగ వేడుకలు జరిగే ప్రాంతాలు, స్థానిక మార్కెట్లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు మరియు ఇతర సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్, నిఘా చర్యలు చేపట్టబడతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత పోలీసు శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పాలపిట్టల అక్రమ పట్టివేత, విక్రయం, బంధించడం మరియు ప్రదర్శనను నిరోధించేందుకు చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడైనా పాలపిట్టను అక్రమంగా పట్టుకోవడం, బంధించడం, విక్రయించడం లేదా హాని కలిగించడం గమనించినట్లయితే వెంటనే సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరడమైనది.
పాలపిట్టను పట్టుకోవడం కాదు స్వేచ్ఛగా ఎగరనివ్వడమే నిజమైన పక్షి సంరక్షణ.
ప్రజలందరూ అటవీ శాఖకు సహకరించి, తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట సంరక్షణలో భాగస్వాములు కావాలని శంషాబాద్ అటవీ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఇతర వివరాలకు 9490523641 సంప్రదించ గలరు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు