వీసా గడువు ముగియకముందే రిజిస్టర్ చేసుకోవాలి: హోంశాఖ
న్యూదిల్లీ: ఇమిగ్రేషన్ నిబంధనల్లో హోంశాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్‌లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగశాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్‌కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. వీరు భారత్‌లో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలి. గతంలో వీసా గడువు పూర్తైన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపునకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండేది. కాని ఇప్ప్పుడు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. భారత్‌లో ఉన్న విదేశీ పౌరులపై పర్యవేక్షణకు ఈ నిబంధన ఉపయోగపడనుంది.
భారత్‌లో సంతానం ఉన్న విదేశీయుల కోసం మరో మార్పు చేసింది. భారత్‌లో బిడ్డ జన్మించిన 30 రోజుల్లోపు ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్త నిబంధన ప్రకారం తల్లిదండ్రుల్లో ఒకరు భారత జాతీయులై ఉండి… తమ పౌరసత్వాన్ని ఉంచుకోవాలనుకుంటే మాత్రం అలాంటి వారికి బిడ్డ పుట్టుక రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపును ఇచ్చింది.
ఇమిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు
- Advertisement -


