Homeజిల్లాలుఅనంతపురంస్వచ్ఛతకు ప్రాధాన్యం.. నార్పలలో స్వచ్ఛాంధ్ర

స్వచ్ఛతకు ప్రాధాన్యం.. నార్పలలో స్వచ్ఛాంధ్ర

- Advertisement -

స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ….

చిన్నారులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్రఉస్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రంగా మార్చాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ సంకల్పానికి, ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని సూచించారు.తడి చెత్త ఉ ఆహార అవశేషాలు, కూరగాయలు, పండ్ల తొక్కలు పొడి చెత్త ఉ ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహ వస్తువులు శానిటరీ చెత్త ఉ డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, మాస్కులు ,ప్రత్యేక వ్యర్థాలు ఉ బ్యాటరీలు, బల్బులు, పెయింట్ డబ్బాలు, గడువు ముగిసిన మందులు ఇలా చెత్తను వేరు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, వ్యర్థాల పునర్వినియోగం పెరుగుతుందని, డంపింగ్ యార్డులపై భారం తగ్గుతుందని, గ్రామాలు, పట్టణాలు మరింత పరిశుభ్రంగా మారతాయని పేర్కొన్నారు.అలాగే ప్రతి ఉద్యోగి, ప్రతి ప్రజాప్రతినిధి తప్పనిసరిగా మూడు బి విధానాన్ని పాటించాలని సూచించారు.
బాటిల్ ఉ స్టీల్ లేదా గాజు నీటి సీసా
బ్యాగ్ ఉ గుడ్డ లేదా జ్యూట్ సంచి
బాక్స్ ఉ స్టీల్ భోజన డబ్బా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ను అందించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి చిన్నారులతో ఆప్యాయంగా గడిపి వారి ఆరోగ్యం, విద్య, పోషకాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆలం వెంకట నరసా నాయుడు, మండల కన్వీనర్ తలారి కుళ్లాయప్ప, సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు, జనసేన మండల కన్వీనర్ గంజి కుంట రామకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, అంగన్వాడీ సిబ్బంది, పార్టీ నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు