Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుగిరిజన సంఘం చొరవతో మంచినీటి వినియోగం..

గిరిజన సంఘం చొరవతో మంచినీటి వినియోగం..

- Advertisement -

విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): గిరిజన సంఘం చొరవతో అందరికీ అందుబాటులో మంచినీటి వినియోగానికి తీసుకొచ్చామని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడపవలస గ్రామంలో గత మూడు వారాల నుంచి మంచినీటి ట్యాంకులో అమర్చిన పరికరాలు మరమ్మత్తులకు గురవడంతో మూడు వారాలు పైబడి గ్రామంలో నీరు అందక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఈ విషయంపై సంబంధిత పంచాయతీ సెక్రెటరీ కి పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం తో ప్రతి ఇంటింటికి 50 రూపాయల నుంచి వంద రూపాయలు వరకు చంద వసూలు చేసి గ్రామస్తుల సహకారంతోనే పాడైన మంచి నుంచి ట్యాంక్ ను మరమ్మత్తులు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు