Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరక్తదాన శిబిరమునకు విశేష స్పందన..

రక్తదాన శిబిరమునకు విశేష స్పందన..

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవ సందర్బంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ధర్మవరం నందు రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు హాజరుకావడం జరిగింది అన్నారు. రక్త శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల రక్తదాతలకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 72 మంది రక్తదానం చేయడం జరిగిందన్నారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ జీవసేవనే శివ సేవ గా భావించి సాటి మనిషి హృదయం లో సంతోషాన్ని ఆనందాన్ని నింపగల్గిన మానవుని జన్మ ధన్యము అని, స్వామి వివేకానందుని స్ఫూర్తితో ఇవాల ధర్మవరం నందు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల వారి ఆద్వర్యం లో రక్త దాన శిబిరం నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి మైత్రి మహిళా సంగం, అలాగే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కలశాల విద్యార్థులు , ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఆర్‌ఎంఓ హరి, శ్రీనివాసులు, డాక్టర్ వైష్ణవి , జిల్లా కుష్టు వ్యాధి ఎయిడ్స్ నియంత్రణ అధికారిణి డాక్టర్ అనుపమ, జెమ్స్ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వెంకటరత్నం , మురళి క్లస్టర్ ప్రోగ్రాం ఆఫీసర్ రమణ, రక్త నిల్వ కేంద్రం హరి ,నారాయణమ్మ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు