విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం మండల తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి ఎస్టీయు రాష్ట్ర పూర్వపు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, వీరేష్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ పి ఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. తక్షణమే పీఆర్సీ కమిటీ నియమించి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 23 వేల కోట్లు బకాయిలు ఉండగా, ప్రస్తుతం అవి 34 వేల కోట్లకు చేరిందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి పిఆర్సి బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, పిఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు మార్కండేయులు, ప్రభాకర్, ఈరన్న, నారాయణరావు, వీరేష్, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


