–ఎస్టియు జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్టియు జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప మండల అధ్యక్ష కార్యదర్శులు ఉరుకుందు, రామాంజిని లు డిమాండ్ చేశారు. ఎస్టియు దశల వారి ఉద్యమంలో భాగంగా శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, పెండింగ్ బకాయిలు చెల్లింపు, సిపిఎస్ విధానం రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ రామేశ్వర రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు సీనియర్ నాయకులు శ్రీనివాసులు, జ్యోతిమూర్తి, లక్ష్మీపతి, నరసింహులు, గోరంట్లయ్య, నాగరాజు, ఎండి కేశవులు, రామాంజనేయులు, తులసయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


