మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; మానవతా విలువలు పెంపొందించేలా ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరము సమాజానికి అని మానవతా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి, అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ చెన్నకేశవ పురంలో అతి పేదరాలైన కుటుంబానికి తల్లి చనిపోవడంతో, శిశువుకు గత ఐదు నెలలుగా లాక్టోజిన్ పాల పౌడర్ ను విరాళాలుగా సేకరించి అందజేయడం జరుగుతోందని వారు తెలిపారు. మానవతా సంస్థ వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతోందని, దాతల సహాయ సహకారాలతోనే తాము నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మంజునాథ్, కోశాధికారి చంద్రశేఖర్, సభ్యులు రవికుమార్, రాజశేఖర్, ఆశా కార్యకర్తలు రజియా సుల్తాన్ ,అరుణ తదితరులు పాల్గొన్నారు.
మానవతా విలువలు పెంపొందించేలా ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరం
- Advertisement -
RELATED ARTICLES


