Homeజిల్లాలుఅనంతపురంకోటి సంతకాల సేకరణకు ఉరవకొండలో అన్యుహస్పందన

కోటి సంతకాల సేకరణకు ఉరవకొండలో అన్యుహస్పందన

- Advertisement -

కూటమి ప్రభుత్వము పై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం లో విశేష స్పందన లభించిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా బుధవారం ఉరవకొండ పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, పేదలను వైద్య విద్యకు దూరం చేస్తోందని వైసిపి ఆరోపించింది. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా, వైసిపి అధినేత జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 60వేలు కు పైగానే ప్రజలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారన్నారు. ఈ సంతకాల సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను ఈనెల 13వ తేదీన అనంతపురంలో ప్రదర్శన చేసినట్లు తెలిపారు.17వ తేదీన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ కు అందుచేనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నదన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో రెండు లక్షల 66 వేల కోట్ల రూపాయలను అప్పు చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూడా విఫలమైందన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది అన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వారిపై దాడులు చేయడం పోలీసు కేసులు నమోదు చేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి అన్నారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో జూద గృహాలు, మద్యం బెల్ట్ షాపులు నిర్వహణ విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు. వీటికి వ్యతిరేకంగా కూడా వైసిపి ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎంపీపీ నర్సింలు, మాజీ ఎంపీపీ ఏసి ఎర్రి స్వామి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుశీలమ్మ, ఉరవకొండ సర్పంచ్ లలిత, కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కౌడికి గోవిందు, డీస్ సురేష్ పార్టీ నాయకులు బసవరాజు, ఈడిగ ప్రసాద్, గోవింద నాయక్, చాబాల సర్పంచ్ జగదీష్ , అశోక్ కుమార్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు