విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిఏ గా పనిచేస్తున్న గుర్రం నందకుమార్ డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పొందిన సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్లు , యం.జయప్రకాష్ గౌడ్ ,శివ శంకర్ , వన్నురప్ప తదితరులు ఉరవకొండలో నందకుమార్ స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి
ఘనంగా సన్మానించి అభినందించారు. నందకుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మేజరు గ్రామ పంచాయతీ శానిటరి మేస్రీ నాగరాజు మరియు ఉరవకొండ మండల పరిషత్ ఆఫిసు సభార్ఠినేట్ ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పొందిన నందకుమార్ కు ఘన సన్మానం
- Advertisement -


