విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ సీతా రామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో డిసెంబర్ 13 వ, 14వ తేదీలలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు యువర్ ఫౌండేషన్ నిర్వాహకులు, హాయ్ బ్రో చెస్ అకాడమీ అనంతపురం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ చెస్ టోర్నమెంట్లు ఎస్ నాగమణి మెమోరియల్ ఆల్ ఇండియా ఓపెన్ జస్ట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ జరుగు రెండు రోజులు భోజన వసతి కల్పించబడునని తెలిపారు. జస్ట్ టోర్నమెంటులో మొత్తము నగదు బహుమతులు 1,25,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. టోర్నమెంట్ అడ్వైజర్స్ కమిటీగా బండ్లపల్లి రంగనాథం, వై కే శ్రీనివాసులు, టి అరిఫుల్లాఖాన్, ఎన్. శ్రీనివాసులు, ఏ వన్ చెస్ అకాడమీ నిర్వాహకులు, శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపం సభ్యులు ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల చేసి క్రీడాకారులు డిసెంబర్ 10వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని, ప్రవేశ రుసుము 300 రూపాయలు డిసెంబర్ 12వ తేదీ లోపు చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్ భాషా, ఈశ్వరప్ప, జాకీర్ హుస్సేన్, షీలా నాగేంద్ర, జయరాం, బండ్లపల్లి రంగనాథ్, రాధాకృష్ణ, వైకే శ్రీనివాసులు, బాలం ఆదిశేషులు, కర్రే రమేష్ బాబు, ఎస్ వాసు పాల్గొన్నారు. మరిన్ని చెస్ వివరాల కోసం సెల్ నెంబర్ 9912647370కు సంప్రదించాలని తెలిపారు.
ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో విజయవంతం చేయండి..
- Advertisement -
RELATED ARTICLES


