Homeజిల్లాలుశ్రీ సత్యసాయికంటి శిబిరం కరపత్రాలు విడుదల.. యువర్ ఫౌండేషన్ కమిటీ

కంటి శిబిరం కరపత్రాలు విడుదల.. యువర్ ఫౌండేషన్ కమిటీ

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను స్వాతి క్లినిక్ లో యువర్ ఫౌండేషన్ సంస్థ కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షీలా నాగేంద్ర సహకార దర్శి రమేష్ బాబు, పి ఆర్ ఓ రాధాకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు పామిశెట్టి నాగభూషణం, కీర్తిశేషులు పామిశెట్టి నారాయణస్వామిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రామిశెట్టి లక్ష్మీకాంతమ్మ, పామిశెట్టి నందకుమార్, ముదిరెడ్డిపల్లి వారు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై కే శ్రీనివాసులు, డాక్టర్ బి వి సుబ్బారావు, వి ఆర్ సి గుప్తా, కోటేశ్వరరావు, ఖలీల్, కౌన్సిలర్ కేత లోకేష్, ఓవి ప్రసాద్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు