Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసాగులో సత్తా చాటిన రైతు..నాలుగు ఎకరాల్లో 160 బస్తాలు!

సాగులో సత్తా చాటిన రైతు..నాలుగు ఎకరాల్లో 160 బస్తాలు!

- Advertisement -

గుజరాత్ టైగ్ వేరుశనగ సాగుతో ఘన విజయం ఎకరాకు 40 బస్తాల దిగుబడి..

రైతు నరసింహారెడ్డి వెల్లడి
విశాలాంధ్ర- రావుల్ చెరువు (ధర్మవరం) : కష్టపడి సాగు చేస్తే వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని రైతు నరసింహారెడ్డి నిరూపించారు. అనంతరం రైతు నరసింహారెడ్డి మాట్లాడుతూ తన నాలుగు ఎకరాల పొలంలో గుజరాత్ టైగ్ రకం వేరుశనగ సాగు చేసి ఏకంగా 160 బస్తాల దిగుబడి సాధించామని తెలిపారు.ఎకరాకు 40 బస్తాల దిగుబడినాలుగు ఎకరాల్లో సాగు చేసిన పంట నుంచి మొత్తం 160 బస్తాల వేరుశనగ దిగుబడి రావడంతో ఎకరాకు సగటున 40 బస్తాల దిగుబడి వచ్చింది అని తెలిపారు. సాధారణంగా వేరుశనగ సాగులో వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు, సాగునీటి లభ్యత, పెట్టుబడి వంటి అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి అని తెలిపారు.. వాటిని అధిగమిస్తూ నరసింహారెడ్డి మంచి దిగుబడి సాధించడం విశేషంగా నిలిచింది అని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు.గుజరాత్ టైగ్ రకం వేరుశనగను సాగు చేసిన నరసింహారెడ్డి మంచి ఫలితాలు సాధించడంతో ఈ రకం పంటపై పరిసర ప్రాంతాల రైతుల్లో ఆసక్తి నెలకొంది. నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకుని పంటను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ సాగు చేయడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని ఆయన పంట నిరూపిస్తోంది.
తోటి రైతులకు ఆదర్శంగా నరసింహారెడ్డి
నాలుగు ఎకరాల్లోనే 160 బస్తాల వేరుశనగ పండించడం రావుల్ చెరువు గ్రామంలో ప్రత్యేకంగా నిలిచింది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ, పంటపై శ్రద్ధ పెడితే మంచి దిగుబడులు సాధించవచ్చని నరసింహారెడ్డి నిరూపించారు.
సాగును భారంగా కాకుండా శాస్త్రీయంగా చేస్తే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది” అనే సందేశాన్ని నరసింహారెడ్డి సాధించిన దిగుబడి చాటిచెబుతోంది. ఆయన విజయాన్ని చూసి మరింత మంది రైతులు గుజరాత్ టైగ్ రకం వేరుశనగ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు