తాళ్లపూడి మండలం లో నేల కొరిగిన వరి పంట
రైతులను ఆదుకోవాలి….మాజీ ఎమ్మెల్యే తలారి
విశాలాంధ్ర – తాళ్లపూడి : తుఫాను కారణంగా వీచిన గాలులకు మండలం లోని పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పంట పలు గ్రామాల్లో నేల కొరిగింది. ఈ నేపధ్యం లోనే వైకాపా నాయకులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పెద్దెవం గ్రామం లో భారీగా నేలకొరిగిన పంటలను సందర్శించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ముందునుంచి చెబుతున్నంత స్థాయిలో లో లేకపోయిన పోయినప్పటికి గాలులు, వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో కోత దశ కు వచ్జిన పంట గజ్జరం, పెద్దెవం తదితర గ్రామాల్లో నేలకి ఒరిగింది. అధికారుల ప్రాధమిక అంచనాల ప్రకారం సుమారు 250 నుండి 350 ఎకరాలు వరకు వుంటుందని అంటున్నారు. ఇంకా వర్షాలు ఎక్కువగా వస్తే పంట నష్టం వుండా వచ్చని అధికారుల భోగోట్టా. పంట నేలకు పడిన తీరు, నీట మునిగిన పరిస్థితుల బట్టి అధికారుల సూచనల మేరకు తగిన జాగ్రతలు పాటించి ఉప్పు ద్రావణం, యూరియా వాడటం ద్వారా పంట ని కాపాడు కోవచ్చని తెలిపారు.


