విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యా ప్రదాత, నిరుపేదల పెన్నిధి, ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురంలోనీ పల్లె నివాసంలో గురువారం కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, వియాన్, వన్మా, కుటుంబ సభ్యులతో కేకు కట్ చేసి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతపురం ,సత్యసాయి ఉమ్మడి జిల్లాల నుంచి పల్లె అభిమానులు ,టీడీపీ కుటుంబ సభ్యులు,బీజేపీ, జనసేన కార్యకర్తలు, పుట్టపర్తి నియోజవర్గ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వందలాది మంది వాహనాల్లో తరలివచ్చి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి కి భారీ ఎత్తున గజమాలలు,పూలమాలతో అభినందనలు తెలిపారు. రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రి, అనాధాశ్రమం లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.


