Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన గొట్లూరు విద్యార్థి ఎం. తౌఫిక్

జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన గొట్లూరు విద్యార్థి ఎం. తౌఫిక్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం క్రికెట్ అకాడమీ నందు సోమవారం జరుగు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలో మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్. హైదర్ వలీ కుమారుడు ఎం. తౌపిక్ ఎంపిక కావడం జరిగిందని కోచ్ కప్పల నరేష్ తెలిపారు. అనంతరం తండ్రి హైదర్ వలీ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కోచ్ నరేష్ వద్ద శిక్షణ పొందడం జరిగిందని, మా కుమారుడు ఎడమచేత్తో క్రికెట్ ఆటలాడుతాడని తెలిపారు. అబ్బాయి పీసీఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ తో పాటు కుమారుని తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, బి సి ఎం ఆర్ పాఠశాల కరెస్పాండెంట్, హెడ్మాస్టర్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు