Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారి… ఎక్సైజ్ సీఐ ఎన్.చంద్రమణి

మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారి… ఎక్సైజ్ సీఐ ఎన్.చంద్రమణి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్, ధర్మవరం పరిది లోని మద్యం దుకాణాలకు రీ-నోటిఫికేషన్ జారి చేయబడినది అని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జి ఎస్ నెంబర్ ఎస్ ఎస్/13 – బత్తలపల్లి మండలం, జి ఎస్ నెంబర్ ఎస్ ఎస్/18- ముదిగుబ్బ మండలం లలో రీనోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.సత్య సాయి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ప్రొహిబిషన్ , ఎక్సైజ్ జిల్లా అధికారి ఏస్.గోవింద నాయక్ ద్వారా ఫై రెండు మద్యం దుకాణాలకు రీ-నోటిఫికేషన్ జారి చేయబడినది అని తెలిపారు.
ఫై దుకాణాలకు సంబందించి అర్హత కలిగిన అబ్యార్తుల నుంచి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానాలలో ధరకాస్తులు ఆహ్వానించబడుతున్నవి అని తెలిపారు. దరఖాస్తులు ఫిబ్రవరి 12వ తేదీ నుండి 21వ తేదీ సాయంత్రం 05.00 గంటల వరకు స్వీకరించబడును అని తెలిపారు. సత్య సాయి జిల్లా లోని 08 ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ల పరిధి లో ధరకాస్తులు సమర్పించవచ్చు అని తెలిపారు.ప్రతి మద్యం దుకాణానికి ధరకాస్తులు చేసుకోవడానికి రూ .2,00,000/- నాన్- రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుచెల్లించవలెను అని తెలిపారు.ధరకాస్తులు పరిశీలన అనంతరం ఫిబ్రవరి 23వ ఉదయం 08.00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, పుట్టపర్తి నందు, జిల్లా కలెక్టర్ ఆధ్యర్యం లో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు నిర్యహించబడును అని తెలిపారు.దరకాస్తులు గేజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హత ప్రమాణాలు, నిబంధనలు, షరతులు పూర్తిగా పరిశీలించి దరకాస్తులు సమర్పించవలసినదిగా వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సంబంధించి ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్, ధర్మవరం , ప్రొహిబిషన్ ,ఎక్సైజ్ జిల్లా కార్యాలయం పుట్టపర్తి సంప్రదించవలసినది గా వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు