చట్ట పరిధిలోని ప్రజలు జీవించాలి
రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రావుల చెరువులో గ్రామ సభను నిర్వహించడం జరిగిందని రూరల్ ఎస్సై .శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కూడా గొడవలకు దూరంగా ఉండాలని, ప్రశాంతమైన జీవితాన్ని చట్ట పరిధిలోనే ఉండే విధంగా జీవించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగిందన్నారు. ఫ్యాక్షన్ జోలుకు వెళ్లరాదని, కష్టపడి పని చేస్తూ తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని సుఖవంతమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. గొడవలు సృష్టించిన, ప్రేరేపించినా కూడా అది చట్టపరంగా నేరమవుతుందని తెలిపారు. మధ్యము, పేకాట వడ్డీ వాటికి దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు వివిధ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో రస్తా విషయమై గొడవ పడుతుండగా ఇరువర్గాలను పిలిచి సమస్య పరిష్కారానికి రెవెన్యూ అధికారులతో సర్వే కూడా చేయించడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు సహకరిస్తేనే గ్రామం ప్రశాంతమైన వాతావరణంలో సుఖంగా జీవించే అవకాశం ఉంది అని వారు స్పష్టం చేశారు.
రావుల చెరువులో గ్రామసభ..
- Advertisement -
RELATED ARTICLES


