Homeఆంధ్రప్రదేశ్జిఎస్ఎల్ సేవలు అభినందనీయం

జిఎస్ఎల్ సేవలు అభినందనీయం

- Advertisement -


– 25 లక్షలతో గుండె జబ్బుల పరికరం బహుకరించిన కొటక్ బ్యాంకు
విశాలాంధ్ర – రాజానగరం : జిఎస్ఎల్ వైద్య కళాశాల ఆసుపత్రి పేద ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీ యమని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ రవికిరణ్ మండలి అన్నారు. మండలంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి కోవిడ్ సమయంలో అందించిన సేవలతో పాటు అతి తక్కువ ధరలకు కార్పోరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడం గుర్తించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా జీఎస్ఎల్ హాస్పిటల్ కి 25 లక్షల విలువ గల గుండెజబ్బుల పరీక్షా (2డి ఎకో కార్డియోగ్రామ్) పరికరాన్ని గురువారం బహుకరించారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాల ప్రధాన అధికారిగా  బాధ్యతలు నిర్వహిస్తున్న రవికిరణ్ చేతులు మీదుగా ఆ పరికరాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిఎస్ఎల్ అందిస్తున్న సేవలను గుర్తించ మని, మరెన్ని వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 2డి ఎకో కార్డియోగ్రామ్ అందించినట్లు చెప్పారు. పేద,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా లేదా అత్యంత తక్కువ ఖర్చుతో వైద్యచికిత్సలు అందజేస్తున్న జిఎస్ఎల్ యాజమాన్యాన్ని అభినందించారు. జిఎస్ఎల్ సంస్ధల ఫైనాన్స్ డైరక్టర్ గ్రంధి రామకృష్ణ మాట్లాడుతూ 25 లక్షల రూపాయల విలువైన ఈ పరికరాలను సామాజిక బాధ్యత గా భావించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ హాస్పిటల్ కి బహుకరించడం గర్వంగా ఉందన్నారు.దీంతో నిరుపేదల గుండె వైద్య పరీక్షలకు మరింత వెసులుబాటు కలుగుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. జీఎస్ఎల్ ఛైర్మన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ  ఇటువంటి సంఘటనలతో  తమ సంస్థలకు  సమాజంపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. అనంతరం రవికిరణ్ తో కలిసి జీఎస్ఎల్ స్మార్ట్ లాబ్ ను, జిఎస్ఎల్ గ్రీన్ లైబ్రరీని సందర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు