Saturday, January 4, 2025
Homeజిల్లాలునెల్లూరుఅధిక యూరియా అనర్థదాయకం.ఏఓ హేమంత్ భరత్ కుమార్

అధిక యూరియా అనర్థదాయకం.ఏఓ హేమంత్ భరత్ కుమార్

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోలినేని చెరువు మరియు అంక భూపాలపురం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారిహేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ అధిక యూరియా వినియోగం అనర్ధ దాయకం అధిక యూరియా వాడటం వల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి తగ్గి చీడపీడలు ఉద్ధృతి అవ్వటం వాటి నివారించడానికి క్రిమి సంహారిక మందులను వియోగించడం తద్వారా సాగు ఖర్చు పెరగటం జరుగుతుందని అన్నారు.వరిలో అయితే కంకులు వేయని పిలకలు, తిరిగి సకాలంలో పాలు పోసుకోక తాలు గింజలు ఏర్పడటం జరుగుతుందని అన్నారు.ఈ రబీ సీజన్లో సాగు చేసిన ప్రతి పంట ఈ పంట నమోదు చేసుకోవలసినదిగా తెలియజేశారు.ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ, సున్నా వడ్డీ పంట రుణాలు మరియు భీమా చెల్లించి ఉన్న రైతులకు పంట నమోదు ఉంటేనే బీమా అర్హులు అయ్యే అవకాశం ఉంటుందని కనుక ప్రతి రైతు ఈ పంట నమోదు నీ గ్రామంలోని గ్రామ వ్యవసాయ ఉద్యానవన సహాయకులను సంప్రదించి చేయించుకోవలసినదిగా తెలియజేశారు.అనంతరం వరి మరియు మిరప పంట పొలాలను పరిశీలించడం జరిగింది మిరపలో అధికంగా పై ముడత ఎక్కువగా ఉండటం గమనించడం జరిగింది అలాగే రసం పీల్చే పురుగులు తామర పురుగులు , ఎర్రనల్లి తెల్ల దోమ గమనించటం జరిగింది దీని నివారణకు రైతులు బు బులుగు, పసుపు, తెలుపు జిగురటలో ఎకరాకు 30 నుంచి 40 వరకు ఉంచినట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క ఉదృత్తి బట్టి పురుగుమందులు పిచ్చికారి చేసుకోవాలి అలాగే వేప నూనె 10,000 పీపీఎం లీటర్ నీటికి 1ఎం ఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన సహాయకులు సిహెచ్ రవీంద్ర మరియు పి నాగరాజు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు