Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంటి వస్తువులు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంటి వస్తువులు దగ్ధం

- Advertisement -

దాదాపు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం

ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితురాలు ఆవేదన
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములోని పి ఆర్ టి వీధిలో గల లేటు తలారి బయన్న తలారి నారాయణమ్మ ఇంట్లో ఈనెల 15వ తేదీ రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బట్టలు, నగదు తదితర వస్తువులన్నీబి పూర్తిగా దగ్ధమైందని బాధితురాలు కూతురు సాయి అంజలీదేవి బాధను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ సోమవారం రాత్రి 6:50 సమయం లో కరెంటు పోవడంతో తాను తెర చెల్లెలు ఇంటికి వెళ్లడం జరిగిందని తెలిపారు. వచ్చిన పది నిమిషాలకే మా ఇంటి పక్కనే ఉన్నవాళ్లు మీ ఇంట్లో నుండి మంటలు వస్తున్నాయి అని సమాచారం అందించారు. అనంతరం తాను హుటాహుటిన ఇంటికి చేరుకోగా అప్పటికే మంటలు అధికం కావడంతో, ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడం జరిగిందని తెలిపారు. ఫోను చేసిన పది నిమిషాల్లోనే ఫైట్ స్టేషన్ రావడం మంటలను అదుపు చేయడం జరిగిందని తెలిపారు. తాను కట్టు బట్టలతో మాత్రమే ఉన్నానని, కనీసం ఒక్క బట్ట కూడా లేదు అని కన్నీటి పర్యంతమైంది. తన తండ్రి తలారి బయన్న పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ముందు భాగంలో చెరుకు రసం వ్యాపారం చేస్తూ 2018లో మృతి చెందాడని, తదుపరి మా అమ్మ తలారి నారాయణమ్మ 2017లో మృతి చెందిందని తెలిపారు. మా నాన్నకు ఇద్దరే కూతుర్లమని అందులో అశ్విని, అంజలీదేవి అని తెలిపారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తాను ఒక్కటే ఇంట్లో ఉంటున్నానని ఏఎన్ఎం కోర్సు చేస్తున్నానని వాపోయింది. నాకున్న ఒకే ఒక్క ఇల్లు (సొంత ఇల్లు) ఇలా కాలిపోవడం, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడం, కట్టుకోవడానికి బట్టలు కూడా లేకపోవడం నన్నెెంతో బాధకు గురిచేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు లేని లోటు ఒకవైపు, అన్ని పోగొట్టుకున్న వైపు మరొకవైపు ఉందని తెలిపారు. మాది చాలా పేద కుటుంబమని, అమ్మానాన్నలు కష్టపడి మమ్మల్ని పోషించడం జరిగిందని తెలిపారు. దాదాపు 40,000 నగదు తో పాటు బట్టలు, ఫ్యాను, ఇతర ఇంటి సామాగ్రి పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. కావున నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరారు. మంటలు దగ్ధమైనప్పుడు ఇంట్లోనే రెండు సిలిండర్లు ఉండడం, సమయానికి ఫైర్ స్టేషన్ వాళ్ళు రావడం ఒకింత ఆలస్యమై ఉంటే సిలిండర్లు కూడా పేలే అవకాశం ఉంది అని స్థానికులు తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ వీరి కుటుంబం చాలా పేద కుటుంబమని ప్రస్తుతం తల్లిదండ్రులు లేని అంజలీదేవికి ప్రభుత్వం తప్పక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు