Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇల్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

ఇల్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 20వ వార్డు పిఆర్టి వీధి నందు నివాసముంటున్న అంజలీదేవి ఇల్లు ఈనెల 15వ తేదీ రాత్రి విద్యుత్ షార్ట్ షర్టు కావడంతో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, నాయకులు పరిశే సుధాకర్, పురుషోత్తం గౌడ్, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు స్వయంగా వారి ఇంటికి వెళ్లి, ఇల్లు దగ్ధమైన ఘటనను వారు పరిశీలించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు తమ వంతుగా 25వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించారు. తదుపరి మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ ఇల్లు దగ్ధం కావడం చాలా బాధాకరమని, మంత్రి తో మాట్లాడి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి విద్యు త్, ఫైర్, పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. తదుపరి టిడిపి నాయకులు మాట్లాడుతూ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు