Thursday, December 11, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆ ప్రచారానికి.. నాకు డబ్బులు అందలేదు: ప్రకాశ్ రాజ్

ఆ ప్రచారానికి.. నాకు డబ్బులు అందలేదు: ప్రకాశ్ రాజ్

- Advertisement -

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో ఈడీ ఎదుట హాజరైన ప్రకాశ్ రాజ్
దాదాపు ఐదు గంటల పాటు విచారించిన ఈడీ
ఇక నుంచి తాను బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయబోనని స్పష్టీకరణ

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈరోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు.విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్‌లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరూ భావించవద్దని సూచించారు. ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదని  చెప్పారు. . .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు