Homeఆంధ్రప్రదేశ్ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి.... గ్రామంలోకి చేరిన సముద్రపు నీరు

ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి…. గ్రామంలోకి చేరిన సముద్రపు నీరు

- Advertisement -

ఉప్పాడ తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగడంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామం జలమయంగా మారింది. భారీ కెరటాల ధాటికి గ్రామం మొత్తం జలమయంగా మారిపోయింది. సముద్రపు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. సముద్రపు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మాయపట్నంలో నీటిని వెనక్కి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన జియో ట్యూబులు,రక్షణ గోడలు ధ్వంసమవడంతో సముద్రపు నీరు వరుసగా గ్రామంలోకి చేరుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు