Homeఅంతర్జాతీయంఇండోనేసియా: 7.7 తీవ్రతతో భూకంపం, 38 మందికిపైగా మృతి

ఇండోనేసియా: 7.7 తీవ్రతతో భూకంపం, 38 మందికిపైగా మృతి

- Advertisement -

ఇండోనేసియాలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా 38 మందికిపైగా మరణించినట్లు ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్‌పీబీ) వెల్లడించింది.ప్రమాద స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది.శిథిలాల కింద చిక్కుకొని పలువురు తీవ్రంగా గాయపడినట్లు బీఎన్‌పీబీ తెలిపింది.ఈ భారీ భూకంపంతో పాటు ఆ వెంటనే సంభవించిన డజన్ల కొద్దీ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలోని అనేక భవనాలు కుప్పకూలాయి. మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి.శనివారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 05:00 గంటలకు కొద్ది సమయం ముందు ఫ్లోర్స్ ద్వీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ఇండోనేసియా వాతావరణ, భూభౌతిక శాస్త్ర సంస్థ (బీఎంకేజీ) పేర్కొంది.

నిద్రలోనే…
తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ గవర్నర్ ఇమాన్యుయెల్ మెల్కియాడెస్ లాకా లెనా మీడియాతో మాట్లాడుతూ, శిథిలాల కింద చిక్కుకుని నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని అన్నారు.భూకంపం, ఆ తర్వాత పదుల సంఖ్యలో సంభవించిన ప్రకంపనల కారణంగా భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసినా, భూకంపం సంభవించిన 3 గంటల తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు