విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న పలు విభాగాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ శ్రీమతి రాయపాటి శైలజ బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పలు వార్డులను సందర్శించి బాధిత రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మెటర్నటీ వార్డ్, సఖి వన్ స్టాప్ కేంద్రాలను తనిఖీ చేసి వారి పనితీరు గురించి వైద్య అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ప్రజల ఆరోగ్యం సంక్షేమమేప్రధానంగా డాక్టర్లు ఇతర వైద్య ఉద్యోగ, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో లైంగిక వేధింపుల నివారణ కమిటీ పనితీరుపై జిల్లా కలెక్టర్ కుఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఆత్మరాశీ కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఏవో మల్లికార్జున రెడ్డి, పలువురు వైద్యులు, జిల్లా సి డబ్ల్యూ సి చైర్మన్ మేడా రామలక్ష్మి, డాక్టర్ శంషాద్ బేగం, ఐసిడిఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు


