విశాలాంధ్ర -నందిగామ : గత రెండు నెలలుగా సబ్ డివిజన్ పరిధిలోనే కాకుండా గుంటూరు పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు ఏసిపి తెలిపారు అతని వద్ద నుండి 300 గ్రాముల బంగారం 300 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేయడం జరిగిందని తెలియజేశారు. సోమవారం స్థానిక ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ సి పి రాజశేఖర్ ఆధ్వర్యంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా,సిసి ఫుటేజ్ పరిగణలోకి తీసుకొని మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని సబ్ డివిజన్ పరిధిలోనే కాకుండా పలు జిల్లాలలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను మొత్తం ఎప్పటికీ 17 దొంగతనాలకు(మైనర్ బాలుడు తో కలిసి)పాల్పడినట్లు వివరాలను సేకరించడం జరిగిందని తెలిపారు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నాగరాజును అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు అంతర్రాష్ట్ర దొంగ నాగరాజు వద్ద నుండి 300 గ్రాముల బంగారు ఆభరణాలు,300 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేసినట్లు ఏసిపి తెలియజేశారు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లయితే వారిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు దొంగలు ఎంత చాకచక్యంగా దొంగతనాలు చేసిన వారిని పట్టుకోవటం జరుగుతుందని తెలియజేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు ఈ సమావేశంలో నందిగామ రూరల్ సీఐ చౌహాన్,ఎస్ఐ దుర్గామల్లేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు…
అంతరాష్ట్ర దొంగ అరెస్టు.. భారీ చోరీ సొత్తు రికవరీ… ఏసీపీ తిలక్
RELATED ARTICLES