Homeఅంతర్జాతీయంయుద్ధం చాలు అని ఇరాన్‌కు అనిపించింది: ట్రంప్

యుద్ధం చాలు అని ఇరాన్‌కు అనిపించింది: ట్రంప్

- Advertisement -

ఇరాన్, అమెరికా దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రపంచ శాంతికి ఇది గొప్పరోజని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందని పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇక చాలు అనిపించిందని యుద్ధాన్ని ఉద్దేశించి అన్నారు.  టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని సూచించారు.ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు అమెరికా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ జలసంధి మీదుగా అంతా సజావుగా సాగేందుకు అమెరికా బలాలు అక్కడ ఉంటాయని స్పష్టం చేశారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేయడానికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు.అన్నీ సవ్యంగా జరగడానికి అమెరికా తప్పకుండా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. అమెరికా మాదిరి ఇరాన్‌కు కూడా మంచి రోజులు రానున్నాయని అన్నారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించిన వెంటనే కూడా ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. తమ సైనిక లక్ష్యాలు నెరవేరాయని, ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగని పేర్కొన్నారు.ఇరాన్, అమెరికా కాల్పుల విరమణలో చైనా పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. “ఇరాన్ కాల్పుల విరమణపై చర్చలకు ఒప్పించడంలో చైనా ప్రమేయం ఉందా?” అని మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన, అది నేను కూడా విన్నానని, అందులో వాస్తవం ఉందనే అనుకుంటున్నానని సమాధానమిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు