Homeఆంధ్రప్రదేశ్Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడం వల్లే... కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక

Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడం వల్లే… కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక

- Advertisement -


అత్యవసర ద్వారాన్ని మూసేశారు.. అందుకే 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై
అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు ప్రయాణికుల ప్రాణాల మీదకు ఎలా వస్తున్నాయో వివరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సంచలన నివేదికను వెల్లడించింది. గతేడాది అక్టోబరులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో అగ్నిప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవదహనమైన ఘటనపై రవాణాశాఖ ఆదేశాల మేరకు ఆస్కీ సమగ్ర అధ్యయనం చేపట్టింది. ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అత్యవసర ద్వారాన్ని మూసేశారు.. అందుకే 19 ప్రాణాలు పోయాయని కర్నూలు బస్సు ప్రమాదంపై నివేదికలో పేర్కొంది.ఈ నివేదికలోని అంశాలు బస్సు యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని, అధికారుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఆ బస్సుకు కేవలం సీటింగ్ బస్సుగా మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా 53 సీట్లను తొలగించి 43 స్లీపర్ బెర్తులుగా మార్చారు. 2023 మార్చిలో ఈ మార్పులు చేసిన సమయంలో అత్యవసర ద్వారానికి అడ్డంగా ఇనుప పైపులతో నిర్మాణం చేపట్టారు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని ఆస్కీ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ ప్రైవేట్ బస్సులో భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఆన్-బోర్డ్ కమ్యూనికేటర్ వ్యవస్థను తొలగించడంతో పాటు, డ్రైవర్ వైపు ఉన్న డోర్‌ను మూసివేసి బోల్టు బిగించారు. నిబంధనల ప్రకారం బస్సులో వాణిజ్య సరకు రవాణా చేయకూడదు, కానీ ఈ బస్సులో ఎల్పీజీ సిలిండర్లు, లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన సెల్‌ఫోన్ పార్శిళ్లను రవాణా చేసినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు గంటకు 86 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, రోడ్డుపై పడి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఢీకొట్టడం వల్లే ఈ ఘోరం జరిగిందని నివేదిక పేర్కొంది.

తనిఖీ అధికారుల వైఫల్యాన్ని కూడా ఈ నివేదిక ఎత్తిచూపింది. ఈ బస్సుకు గతంలో డమన్- డయ్యులో ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేసినా, బస్సులో చేసిన మార్పులను అధికారులు గుర్తించలేదు. అనంతరం ఒడిశాలో రీ-రిజిస్ట్రేషన్ జరిగినా, ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ నిబంధనల ప్రకారం హోమ్ స్టేట్‌కు వెళ్లాల్సి ఉన్నా ఆ బస్సు ఏడాది కాలంగా అక్కడికి వెళ్లలేదు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) నిబంధనలకు విరుద్ధంగా బస్సు బాడీని నిర్మించడం, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వంటి అనేక లోపాలు 19 మంది ప్రాణాలను బలితీసుకున్నాయని ఆస్కీ నివేదిక తేల్చి చెప్పింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు