Homeజిల్లాలుఅనంతపురంవినాయక చవితి ఉత్సవాలపై జెసి. ప్రభాకర్ రెడ్డి సమీక్ష

వినాయక చవితి ఉత్సవాలపై జెసి. ప్రభాకర్ రెడ్డి సమీక్ష

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలో వినాయక చవితి సందర్భంగా జరగనున్న వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ జెసి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటు, వాటి నిర్వహణ, ఉత్సవాల సమయంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు తదితర వాటి గురించి చర్చించారు. పెద్ద విగ్రహాలను ఒక ప్రదేశంలో, చిన్న విగ్రహాలు మరొక ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అందరీ సహకారంతో వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందామన్నారు. ఉత్సవాల నిర్వహణ, విగ్రహాలు ఏర్పాటు చేయదలచిన వారితో ఈనెల 8వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత కైలాస మోక్షాధామం (రుద్రాభూమి) అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ, కైలాస మోక్ష ధామం కమిటీ సభ్యులు కత్తి లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాధాకృష్ణ, గంగాధర్, రంగనాథ రెడ్డి, సురేంద్రనాథ్, సూర్యముని, రంగనాథ ప్రసాద్ బాబు, బాల సుబ్రమణ్యం, రాఘవ, లింగం కృష్ణయ్య, సుదర్శన శర్మ, కొట్టే విజయ్ కుమార్, మూతి రామకృష్ణ, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు