విశాలాంధ్ర ధర్మవరం : తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 హాకీ పోటీలలో ధర్మవరం పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎస్. విక్కి ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి లో జరిగే హాకీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెడ్ మిస్టర్స్ సిస్టర్ సుజాత తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థి డిసెంబర్ నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.ఎంపికైన విద్యార్థిని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్య ప్రకాష్ , పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత,కరెస్పాండెంట్ సిస్టర్ రిన్సీ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయని బృందం తల్లిదండ్రులు, పాఠశాల పి ఈ టి, తోటి విద్యార్థులు అభినందించారు.
జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ హాకీ పోటీలకు జీవనజ్యోతి పాఠశాల విద్యార్థి ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


