కాయకల్ప థీమ్స్ అధికారులు స్టీఫెన్ పాల్, సురేందర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను మరింత మెరుగుపరచాలని, ఇందుకు ఆసుపత్రి అధికారులు, సిబ్బంది సమన్వయంతో తమ విధులను నిర్వర్తించాలని కాయకల్ప కార్యక్రమ టీం అధికారులు స్టీఫెన్ పాల్, సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా కాయకల్ప కార్యక్రమములో భాగంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వార్డులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఓపి వార్డు, ఫార్మసీ, లేబర్ రూమ్, పోస్ట్మాస్టర్ రూమ్, ఆసుపత్రి పరిసరాలు, రోగులకు అందించే భోజనపు గది, ల్యాబ్, తదితర వాటిని పరిశీలిస్తూ అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్నచోట వెనివెంటనే వాటిని పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రతి వార్డులోనూ పరిశుభ్రతను మెరుగుపరిచే విధంగా ఉంటేనే అటు రోగులకు, ఇటు ఆసుపత్రికి మంచి గుర్తింపు వస్తుందని వారు తెలిపారు. ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సమన్వయంతో, కలిసిమెలిసి, తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. మందుల కొరత లేకుండా చూడాలని, రోగులకు అందించే భోజనం నాణ్యంగా ఉండాలని, రోగులకు వైద్యమును అందించే పద్ధతిలో ఉండాలని తెలిపారు. ఆసుపత్రి సమస్యలు ఏవైనా ఉంటే మా కాయకల్ప టీంకు ఎప్పటికప్పుడు సూపర్డెంట్ ద్వారా తెలియజేయాలని తెలిపారు. అనంతరం రోగులకు అందించే భోజనం నాణ్యతగా ఉండేలా, అందరికీ అందేలా ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తూ వారి భద్రత పట్ల కూడా కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్న ఈ నియోజకవర్గంలో వైద్యులు, సిబ్బంది మరింత కృషి చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. తిప్పేందర్ నాయక్, డాక్టర్ మాధవి, నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి, హెడ్ నర్సులు పూర్ణచంద్ర, గంగాదేవి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను మరింత మెరుగుపరచండి..
- Advertisement -
RELATED ARTICLES


