ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లి వద్ద గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా నైపుణ్య అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ మేళాలో పదవ తరగతి ,ఇంటర్మీడియట్, డిప్లొమా ,డిగ్రీ పీజీ పూర్తి చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు. జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15 వేల రూపాయల నుండి 23,000 జీతం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరు ,కడప, పెనుకొండ, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు, విద్యా అర్హత పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటల లోపు చేరాలని తెలిపారు. ఆసక్తిగల యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 91 82288 465 కు సంప్రదించాలని తెలిపారు.
11న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా..
- Advertisement -
RELATED ARTICLES


