Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమం..

కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమం..

- Advertisement -

అధ్యక్షులు చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం: అఖిల గాండ్ల సంక్షేమ సంఘం ధర్మవరం ఆధ్వర్యంలో బత్తలపల్లి రోడ్ నందు గల సిఎన్బి గార్డెన్ నందు గాండ్ల కులబందువులు, కుల పెద్దలు అందరి కలయికతో కార్తీక మాస వన భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుల బంధువులు అందరూ మొదట పరమశివునికి పూజా కార్యక్రమం నిర్వహించి తర్వాత కుల పెద్దల సమక్షంలో గాండ్ల సంఘం ఏర్పాటు , అభివృద్ధి కొరకు చేయాల్సిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ధర్మవరం లో గాండ్ల సంఘం 1975 సంవత్సరంలో 17 మంది తో ఏర్పడి అప్పటి నుండి ఇప్పటికి 209 సభ్యులతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా హాజరైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాండ్ల సంజీవయ్య, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రమణి మాట్లాడుతూ మనం అభివృద్ధి చెందాలి అంటే విద్య అనేది ఎంతో ముఖ్యమని, అందరూ ఐక్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి జిల్లా అఖిల గాండ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసెట్టి గంగప్ప ,కార్య నిర్వాహక అధ్యక్షుడు జోగన్న గారి లక్ష్మయ్య , ప్రధాన కార్యదర్శి గార్లదిన్న మల్లికార్జున,కోశాధికారి పుట్టపర్తి నరసింహులు, అనంతపురం జిల్లా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మేడాపురం పసల వెంకట్రాముడు,కోశాధికారి గవ్వల లక్ష్మీ నారాయణ, ఓంకార్ బయన్న ,కునుతురు నరసింహులు, చెన్నంశెట్టి రమేష్ , చెన్నంశెట్టి శ్రీన,గోపాల్ తదితర గాండ్ల కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు