ఎస్ ఐ. మరిడి నాయుడు
విశాలాంధ్ర-వలేటివారిపాలెం : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. ఆదివారం రాత్రి వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామంలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా లోన్ యాప్ ల విషయం లో అప్రమత్తంగా ఉండాలని, ఆశకు పోయి ఇబ్బందులకు గురి కావద్దని యువతకు చూసించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మరిడి నాయుడు మాట్లాడుతూ యువత మత్తు పదార్ధాలు వాడి అనారోగ్యం కొనితెచ్చుకోవద్దని తెలిపారు. జూదం, మధ్యం,కోడిపంధ్యాలు వంటి వ్యాసనాలకు దూరంగా ఉండాలని అన్నారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గ్రామంలో ప్రజలకు తమవంతు బాధ్యతగా చైతన్యపరచాలని తెలిపారు. ప్రజలు ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని, మధ్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు.గ్రామంలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.


