ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేసిన పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 1వ తేదీ కదిరి నియోజవర్గంలోని పెద్దన్న గారి పల్లి గ్రామంలో వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర ఆధ్వర్యంలో విద్యా రంగ సమస్యల గురించి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కి పలు విషయాలను తెలియజేస్తూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) విధానంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం: 590 తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాలలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) విధానంలో రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ ఆపాలి వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానంలో ఏర్పాటు చేయడం ద్వారా రూ.3,700 కోట్ల అభివృద్ధి ఖర్చు, ఏటా రూ.500 కోట్ల నిర్వహణావ్యయం ఆదా అవుతుందంటూ తెలిపారు. సుమారు 60 ఏళ్లపాటు ప్రభుత్వ భూమి,వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లి, వారికి ఆదాయవనరులుగా మారతాయి అని తెలిపారు. మేనేజ్మెంట్ కోటా ద్వారా ఇచ్చే 25 శాతం సీట్లు (375) ఒక్కో సీటుకు దాదాపు రూ.50 నుండి 60 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ అధిక ఫీజు కారణంగా పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
పిపిపి విధానం కారణంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యు ఎస్ వర్గాలు సుమారు 55 శాతం వైద్య విద్య సీట్లను కోల్పోవడమే కాకుండా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు రిజర్వేషన్ వర్తించేటువంటి 3,675 ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది అని తెలిపారు. అనంతరం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో సమస్య పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ హాస్టల్లో వార్డెన్ల పోస్టులను భర్తీ చేయాలి.. ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేసిన ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్
జగదీష్…. ఈనెల 1వ తేదీ ఆదివారం కదిరికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏఐఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జగదీష్ విద్యారంగా సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ హాస్టల్లో వార్డెన్ల పోస్టులు ఖాళీగా ఉండటం వలన రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అని తెలిపారు. అంతేకాకుండా సరైన సమయానికి హాస్టల్ వార్డెన్ హాస్టల్లో లేనందున అక్కడున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు సరైన సమయానికి కనీసం భోజనం చేయని పరిస్థితి, అదేవిధంగా ప్రతి ఒక్క హాస్టల్లో దగ్గర కనీసం వాచ్మెన్ కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెనివెంటనే హాస్టల్ వార్డెన్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని తెలిపారు. అదేవిధంగా
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో గతంలో అక్కడ ఒక డిగ్రీ కళాశాల ప్రభుత్వం ఏర్పాటు చేసి అర్ధాంతరంగా ఆగిపోయిందని, ప్రభుత్వం వెంటనే ఆ కళాశాలను నిర్మాణాలు పూర్తి చేయాలని కోరడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.


