శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు.. వీరనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయములోని శిరిడీ సాయిబాబా గార్డెన్స్ (స్పందన హాస్పిటల్ దగ్గర) లో ఈనెల 13వ తేదీ గురువారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యదర్శి రామలింగయ్య, ఉప కార్యదర్శి నాయుడు, కోశాధికారి సూర్యనారాయణ, డైరెక్టర్ సూర్య ప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వారు.. హోసూరు క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు వారు నిర్వహిస్తున్నారు అన్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారికి స్పాట్ ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు మహిళలకు కూడా ప్రాధాన్యత కలదని తెలిపారు. పదవ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉంటుందని తెలిపారు. హాస్టల్, భోజనము, రవాణా ఖర్చు ఉచితంగా కంపెనీ వారిచే ఇవ్వబడుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పాస్పోర్ట్స్ సైజ్ ఫోటోసు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, విద్యా అర్హతల వివరాల యొక్క జిరాక్స్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లను పొందుపరచాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 897702409 కు గాని 7075699199 కు సంప్రదించాలని తెలిపారు. కావున నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
నిరుద్యోగులు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


