టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఈ ప్రభుత్వానికి విద్య, వైద్యమే మొదటి ప్రధాన్యత అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో వారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన అంజనాబాయికి 70వేలు, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన వినయ్ కు 19వేల రూపాయల చెక్కులను(మొత్తం రూ. .89,88,000)అందజేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, శ్రీరామ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైద్యం విషయంలో ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలకు ఎక్కడా ఆటంకం కల్గకుండా ప్రభుత్వం చూస్తోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని వారిని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే సాయం చేస్తున్నారని శ్రీరామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులపై అధికారులతో పరిటాల శ్రీరామ్ సమావేశం
ప్రజల ఇబ్బందులు తీరేలా, అలాగే గ్రామాలు, కాలనీల్లో సమస్యలు తీరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ సూచించారు. 15వ ఆర్థక సంఘం నిధుల విడుదల నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలోని తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ ఎంపీడీఓలు, ధర్మవరం మున్సిపల్ కమిషనర్లతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ధర్మవరంలోని శ్రీరామ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మండలాలు, పట్టణానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. మండలానికి ఎంత మేర నిధులు రావచ్చు.. వాటితో ఎలాంటి పనులు చేయబోతున్నారన్న అంశాల గురించి చర్చించారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో గ్రామాల్లో తాగునీరు, స్మశాన వాటికలు, డ్రైనేజీలు, రోడ్లువంటివి ఉన్నాయన్నారు. ముందుగా వీటికి ప్రధాన్యత ఇస్తూ పనుల రూపకల్పన చేయాలని శ్రీరామ్ సూచించారు. ప్రాధాన్యత వారిగా పనులు చేపట్టాలన్నారు. ధర్మవరం పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలు చెప్పారని, వాటి పై దృష్టి సారించాలని కమిషనర్ తో అన్నారు. ముందుగా గ్రామాలు, కాలనీల్ని ఒకసారి పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.


