Homeజిల్లాలుఅనంతపురం90 ఏళ్ల వయసులో గుండెపోటు.. కిడ్నీ వ్యాధి ఉన్నా ప్రాణాలు కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు

90 ఏళ్ల వయసులో గుండెపోటు.. కిడ్నీ వ్యాధి ఉన్నా ప్రాణాలు కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : గుండెపోటు.. పైగా 90 ఏళ్ల వయసు.. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌).. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కిమ్స్‌ సవీరా ఆసుపత్రి వైద్యులు అత్యవసర యాంజియోప్లాస్టీ చేసి వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చికిత్సనందించిన ఆసుపత్రి చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మూడే సందీప్‌ మరియు కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పర్వేజ్‌ నవాజ్.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తాలూకా అగళి ప్రాంతానికి చెందిన 90 ఏళ్ల వృద్ధుడు తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చారు. వయసు అధికంగా ఉండటంతోపాటు ఇప్పటికే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం చికిత్స చేయడం సవాలుగా మారిందన్నారు . గుండెకు రక్తప్రసరణను వీలైనంత త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉండగా.. చికిత్సలో ఉపయోగించే కాంట్రాస్ట్‌ డై వల్ల మూత్రపిండాలపై అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అత్యవసర చికిత్సకు చేయడం జరిగిందన్నారు. కార్డియాలజీ బృందం అత్యవసరంగా యాంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్‌ అమర్చింది. దీంతో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రక్తప్రసరణ పునరుద్ధరించారు.
మూత్రపిండాల వ్యాధి ఉన్న నేపథ్యంలో చికిత్సలో కాంట్రాస్ట్‌ డైను సాధ్యమైనంత తక్కువ పరిమాణంలోనే ఉపయోగించారన్నారు. తద్వారా మూత్రపిండాలపై అదనపు ప్రభావం పడకుండా నెఫ్రాలజీ వైద్యులు డా. బదరీనాథ్ మరియు డా. సమీర్ జాన్ సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. గుండెకు అవసరమైన అత్యవసర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. చికిత్స అనంతరం వృద్ధుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. అనంతరం స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
వృద్ధాప్యంలో గుండెపోటుతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు చికిత్సలో అనేక సవాళ్లు ఉంటాయని డా. నవాజ్ తెలిపారు. అయితే సరైన సమయంలో గుర్తించి, పరిస్థితికి అనుగుణంగా చికిత్సను ప్రణాళికాబద్ధంగా అందిస్తే అధిక వయసున్న వారిలోనూ ప్రాణాలను కాపాడే గుండె చికిత్సలు విజయవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.
అధిక వయసు, మూత్రపిండాల వ్యాధి వంటి సమస్యలు ఉన్న రోగులకు అత్యవసర గుండె చికిత్స అందించేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. ఈ రోగిలో గుండెకు రక్తప్రసరణను వీలైనంత త్వరగా పునరుద్ధరించడంతోపాటు మూత్రపిండాలపై భారం తగ్గించేలా చికిత్సను ప్రణాళిక చేశాం. తక్కువ మోతాదులో కాంట్రాస్ట్‌ డైను ఉపయోగిస్తూ యాంజియోప్లాస్టీని విజయవంతంగా పూర్తి చేశాం” అని తెలిపారు. చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మూడే సందీప్‌ మాట్లాడుతూ.. “కిమ్స్‌ సవీరా కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉన్నాయి. సంక్లిష్ట గుండె జబ్బులకు, నిర్మాణాత్మక గుండె సమస్యలకు సంబంధించిన చికిత్సలను కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. అధిక వయసు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న రోగుల్లో సకాలంలో నిర్ణయం తీసుకోవడం, నైపుణ్యంతో చికిత్స అందించడం, చికిత్స సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకం” అని అన్నారు. తీవ్రమైన గుండెపోటు లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా సమీపంలోని అత్యవసర వైద్య కేంద్రానికి తీసుకెళ్లడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు